విశాఖ జిల్లా అనకాపల్లిలో కరోనా కేసులు పెరగటంతో గవరపాలెం ప్రాంతాన్ని మొత్తం కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారని, ఇక్కడ ప్రజలు పడుతున్న సమస్యలను అధికారులు పట్టించుకోవటం లేదని ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆరోపించారు. ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు పాస్‌లు అందించాలని కోరారు. కరోనా సోకిన వారికి 10వేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కంటైన్మెంట్ జోన్ పరిధిలోని ప్రజలకు వార్డు వాలంటీర్లతో నిత్యావసర సరకులు పంపిణీ చేయాలని కోరారు.
ఇదీ చూడండి భారత్‌లోని ఈ పర్యటక ప్రాంతాలు గూగుల్ మ్యాప్స్‌కూ చిక్కవు!