అశోక్ గజపతిరాజును విమర్శించే స్థాయి ఎంపీ విజయసాయి రెడ్డికి లేదని విశాఖ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
16 నెలలు జైల్లో ఉండొచ్చిన విజయ సాయిరెడ్డి.. పుట్టుకతోనే రాజవంశీకులైన అశోక గజపతి రాజు గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని అన్నారు. 'మాన్సాస్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న విజయసాయి.. ఏడాది కాలంగా వైకాపా ప్రభుత్వం నియమించిన సంచయిత ఛైర్మన్‌గా ఉన్నారు. అప్పుడు సంస్థలో అక్రమాలు కనబడలేదా ? ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలతో ఆడుకోవటం సరికాదు' అని వెలగపూడి హితవు పలికారు.
ఇదీ చదవండి..