విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వేతనాల పెంపు కోసం వెలుగు, మెప్మా ఉద్యోగుల 36 గంటల నిరవధిక నిరసనకు తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ సంఘీభావం తెలిపారు. తమకు బకాయి పడ్డ జీతాలను తక్షణమే చెల్లించి, ప్రభుత్వం ప్రకటించిన వేతన జీవోను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఎండలో ధర్నా చేయటంతో ఓ మహిళా ధర్నా ప్రాంతంలోనే స్పృహ తప్పి పడిపోయింది. ప్రభుత్వం నుంచి వేతనాలు అందేవరకూ మహిళలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెదేపా నేతలు తెలిపారు.
ఇదీ చదవండి: