విశాఖ లక్ష్మీ టాకీస్ వద్ద రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను.. జీవీఎంసీ అధికారులు తొలగిస్తున్న క్రమంలో.. ఉద్రిక్తత నెలకొంది. దుకాణాలను తొలగిస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్.. అక్కడకు చేరుకుని బాధితులకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు.
విశాఖ దక్షిణ నియోజకవర్గం, 39 వ వార్డులో జీవనోపాధి కోసం 25 ఏళ్లుగా నడుపుతున్న షాపులను అన్యాయంగా తొలగిస్తున్నారంటూ మహిళలు ఆవేదన చెందారు. వైకాపాకు పనిచేశారనే కక్ష సాధింపుతో.. స్థానిక ఇండిపెండెంట్ కార్పొరేటర్ దుకాణాలను తొలిగించాలంటూ జీవీఎంసీకి ఫిర్యాదు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. దుకాణాలను కూలగొట్టేందుకు వచ్చిన జేసీబీ వాహనాలను అడ్డుకుని ఎమ్మెల్యే నిరసన తెలిపారు.
ఇదీ చదవండి:
శ్రీవారి దర్శన టికెట్ల ఆగస్టు కోటా విడుదల.. అనూహ్య డిమాండ్‌తో సర్వర్‌లో సాంకేతిక సమస్య