విజయవాడలో జై భీమ్ పేరుతో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశం తీరు తెన్నులు చూస్తుంటే.. దళితుల పేరుతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్‌లా కనిపించడం లేదని, దళితద్రోహి చంద్రబాబు భజన కోసం ఏర్పాటు చేసిన సమావేశంలా ఉందని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున విమర్శించారు. చంద్రబాబు చేత, చంద్రబాబు కొరకు, చంద్రబాబు కోసం ఏర్పాటు చేసిన సమావేశంగా అభివర్ణిస్తున్నామని విశాఖలో ఆయన అన్నారు. చంద్రబాబు చెప్పింది చెప్పటానికి.. జై భీమ్ అని, దళితుల రౌండ్ టేబుల్ అని పేర్లు ఎందుకు అని ప్రశ్నించారు. దళితుల పేరుతో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం వెనుక కూడా చంద్రబాబు ప్లాన్ చేసిన చీకటి ఎజెండా ఉందని.. చంద్రబాబు చెప్పుచేతల్లో ఉన్నట్టు, తమ దళిత సోదరులు కీలుబొమ్మల్లా మాట్లాడారని ఆరోపించారు.
ఇవీ చూడండి...