ETV Bharat / state

'రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జూనియర్ కళాశాల పనులకు మోక్షం' - రచ్చబండలో పాల్గొన్న చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలోని రోలుగుంటలో... ఎంతోకాలంగా ప్రతిపాదనలో ఉన్న జూనియర్ కాలేజీ, రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విస్తరణలకు త్వరలో మోక్షం కలుగుతుందని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. చోడవరంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

mla karanam darmasri participate in rachabanda programme at vishakapatnam
'రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జూనియర్ కళాశాల పనులకు మోక్షం'
author img

By

Published : Nov 10, 2020, 10:06 AM IST

విశాఖ జిల్లా చోడవరంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు. ఎంతోకాలంగా ప్రతిపాదనలో ఉన్న విశాఖ జిల్లా చోడవరంలోని జూనియర్ కాలేజీ, రోలుగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం విస్తరణలకు త్వరలో మోక్షం కలుగుతుందని ఆయన వెల్లడించారు. కొండపాలెం, నిండుకొండ, రోలుగుంట పంచాయతీలలో నూతనంగా ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ప్రస్తుతం నడుస్తున్న జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాల, రోలుగుంటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆసుపత్రిగా విస్తరించేందుకు సీఎం జగన్​తో చర్చించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది నెలల్లోనే మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలతో పాటు అదనంగా మరికొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని వెల్లడించారు.

ఇదీ చదవండి:

ఔత్సహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించాలి: కడప కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.