విశాఖ మన్యంలో జగన్ అన్న పచ్చతోరణం వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 71 వన మహోత్సవంలో భాగంగా పాడేరు మండలం చింతలవీధి పంచాయతీ నడింవీధి హౌసింగ్ లేవుట్ వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో డాక్టర్ వెంకటేశ్వర్లు, డిఎఫ్ఓ వినోద్ కుమార్ మొక్కలు నాటారు. విశాఖ ఏజెన్సీ అటవీ ప్రాంతంలో 11 మండలాల్లో 16.5 లక్షలు మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. త్వరలోనే ఈ కార్యక్రమం అన్ని ప్రాంతాల్లో ప్రారంభమవుతుందని వినోద్ కుమార్ చెప్పారు.
ఇవీ చూడండి...