గిరిజన ప్రాంతాల్లో 100% ఉద్యోగ కల్పన జీవో 3 రద్దుపై ప్రభుత్వం స్పందించిందని.. విశాఖ జిల్లా పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి తెలిపారు. ఈ విషయాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని చెప్పారు. జూన్ 18న గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్ప శ్రీవాణి అధ్యక్షతన జరగబోయే గిరిజన సలహా మండలి సమావేశంలో జీవో 3 రివ్యూ పిటిషన్‌పై చర్చిస్తామన్నారు.
అవసరమైతే ఎంపీల సాయంతో కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి చట్టబద్ధత తీసుకునేలా ప్రయత్నాలు చేస్తామని స్పష్టంచేశారు. గిరిజనులను అన్నివిధాలా ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. వివిధ సంఘాల నాయకులు జీవో 3 రివ్యూ పిటీషన్‌పై తనను కలిశారని.. అందరికీ న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వెల్లడించారు.
ఇవీ చదవండి... కంప్యూటర్ సీపీయూలోకి దూరిన సర్పం