విశాఖ ఏజెన్సీలోని పలు అభివృద్ధి పనులకు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి శంకుస్థాపన చేశారు. విశాఖ మన్యంలోని కొయ్యూరు, గూడెంకొత్తవీధి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కొయ్యూరు నుంచి మంపు వరకు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద 2 కోట్లు 95 లక్షలు, కొయ్యూరు నుంచి రేవళ్ల వరకు 5కోట్ల 95 లక్షల నిధులతో నిర్మాణం చేపట్టనున్న రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
వైఎస్సార్ ప్రభుత్వం గిరిజన ప్రజలు కష్టాలు తెలుసుకుంటూ వారికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కొయ్యూరు మండలంలోని మర్రిపాలెం, చిట్టెంపాడు, జోగంపేట వరకు తారు రోడ్ల కోసం 5 కోట్ల 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలిపారు.
ఇదీ చదవండి: