ETV Bharat / state

రండి.. పరిశ్రమలు పెట్టండి ! దేశ ఆర్థిక ప్రగతిలో ఏపీనే కీలకం !: జీఐఎస్​ రోడ్ షోలో మంత్రులు - ఈజ్​ ఆఫ్ డూయింగ్ బిజినెస్

GIS IN MARCH AT VIZAG : ఈజ్​ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్​లో ఏపీ అగ్రస్థానంలో ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్​ పేర్కొన్నారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో జరుగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్​మెంట్ సమ్మిట్ ప్రచారంలో భాగంగా బెంగుళూరులో రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు.

GIS SUMMIT ON MARCH IN VIZAG
GIS SUMMIT ON MARCH IN VIZAG
author img

By

Published : Feb 14, 2023, 4:32 PM IST

Updated : Feb 14, 2023, 5:10 PM IST

GIS IN MARCH AT VIZAG : దేశ ఆర్ధిక ప్రగతిలో ఏపీ కీలక భూమిక పోషిస్తోందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో జరుగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్​మెంట్ సమ్మిట్ ప్రచారంలో భాగంగా బెంగుళూరులో రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ రోడ్​షోకు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్​, గుడివాడ అమర్నాథ్ హాజరయ్యారు. దేశం నుంచి జరిగిన ఎగుమతుల్లో ఏపీ నుంచి 4.6 శాతం మేర ఉన్నాయన్నారు. ఈజ్​ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్​లో ఏపీ అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు.

పరిశ్రమలకు కేటాయించేందుకు రాష్ట్రంలో 48 వేల ఎకరాల భూమి సిద్ధంగా ఉందని.. దీనికి అదనంగా లక్ష ఎకరాల భూమి పరిశ్రమల కోసం కేటాయించామన్నారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా 3 పారిశ్రామిక కారిడార్​లు ఏపీలో ఉన్నాయన్నారు. కొవిడ్ పరిస్థితులు దాటుకుని ఏపీ 11.46 శాతం వృద్ధి నమోదు చేస్తోందన్నారు. కియా, బ్రాండిక్స్, ఆపాచే లాంటి విదేశీ సంస్థలు ఏపీలో పని చేస్తున్నాయన్నారు.

శ్రీసిటీలో 28 దేశాలకు చెందిన వేర్వేరు కంపెనీలు పారిశ్రామిక ఉత్పత్తిలో ఉన్నాయని మంత్రి వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1.9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. కొత్తగా 3 పోర్టుల నిర్మాణంతో ఏపీలో పోర్టుల సంఖ్య 10కి చేరిందన్నారు. పోర్టులు సిద్ధం అయితే ఏపీ నుంచి జరిగే ఎగుమతులు 10 శాతానికి చేరతాయని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. పోర్టు ఆధారిత ఉత్పత్తి పరిశ్రమలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలన్నది తమ లక్ష్యమని అన్నారు.

ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వివిధ రంగాల వారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. నైపుణ్యం ఉన్న మానవ వనరుల్ని అందించేందుకు వీలుగా నైపుణ్యాభివృద్ధి సంస్థలూ ఏర్పాటు చేశామన్నారు. పరిశ్రమలు అతి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసుకునేలా వివిధ చర్యలూ చేపట్టామని తెలిపారు. ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలు కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Feb 14, 2023, 5:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.