ETV Bharat / state

'త్వరలోనే విశాఖ నుంచి సీఎం జగన్​ పరిపాలన చేస్తారు'

author img

By

Published : Jan 21, 2021, 9:56 PM IST

విశాఖలో మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కన్నబాబు ఇంటింటికి రేషన్​ అందించే వాహనాలను ప్రారంభించారు. జిల్లాలో 828 వాహనాలు లబ్ధిదారులు సరుకులు అందిస్తాయని మంత్రి అవంతి పేర్కొన్నారు. తెదేపా కడుపు మంట బ్యాచ్ అని..దీనిపై కూడా విమర్శలు చేస్తోందని మంత్రి కన్నబాబు మండిపడ్డారు.

ministers muthamsetti srinivasa rao and kannababu launched house-to-house ration vehicles in visakhapatnam
మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కన్నబాబు

విశాఖపట్నం ఆర్కే బీచ్​లో ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల అందించే వాహనాలకు జెండా ఊపి మంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కన్నబాబు ప్రారంభించారు. అనంతరం మంత్రి అవంతి స్వయంగా వాహనాన్ని నడిపారు.

ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల వాహనాలు ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో 828 వాహనాలు లబ్ధిదారులకు సరుకులు అందిస్తాయని అన్నారు. త్వరలోనే విశాఖ నుంచి సీఎం జగన్ పరిపాలన చేస్తారని.. ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా ఆగదని చెప్పారు. జగన్ చెప్పారంటే చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని మంత్రి కన్నబాబు తెలిపారు. తెదేపా కడుపు మంట బ్యాచ్ అని..దీనిపై కూడా విమర్శలు చేస్తోందని మండిపడ్డారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు వెయ్యి కోట్లు: మంత్రి శంకర్ నారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.