విశాఖ జిల్లా చోడవరంలో వైకాపా కార్యాలయం, విత్తనాభివృద్ధి సంస్థ భవనానికి శంకుస్థాపన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, అవంతి, ఎంపీ విజసాయిరెడ్డి, సత్యవతి పాల్గొన్నారు. పెద్ద ఎత్తున వైకాపా కార్యకర్తలు, ప్రజలు గూమిగూడారు. ఓ వైపు చోడవరంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రజాసంఘాలు అవగహన కార్యక్రమలు చేపడుతుంటే... మరోవైపు కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించటం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భౌతికదూరం, వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించాల్సిన ప్రజాప్రతినిధులే నిబంధనలకు నీళ్లు వదలటంపై పలువురు మండిపడుతున్నారు.
భౌతికదూరం మరచి... బాధ్యత విస్మరించిన ప్రజాప్రతినిధులు - భౌతిక దూరం మరచి...బాధ్యత విస్మరించిన ప్రజాప్రతినిధులు
ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే నిబంధనలకు నీళ్లు వదిలారు. కోవిడ్-19పై అవగహన కల్పించాల్సిన వారే... ఉల్లంఘనకు పాల్పడ్డారు. విశాఖ జిల్లా చోడవరంలో జరిగిన ఓ కార్యక్రమంలో భౌతిక దూరం మరచి... బాధ్యత విస్మరించిన మంత్రులు, ఎంపీలను చూసి జనం మండిపడుతున్నారు.