విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం టి. నగరపాలెం, తాటితూరులలో అభివృద్ధి పనులకు మంత్రి అవంతి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. టి.నగరపాలెంలో రూ. 74 లక్షలతో సీసీ రహదారి, తాటితూరులో రూ. 10 లక్షల వ్యయంతో నిర్మించిన అంగన్వాడీ భవనాలను ప్రారంబించారు.
రైతు భరోసా కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని మంత్రి చెప్పారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జగన్ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అవినీతి రహిత పాలన అందించటమే వైకాపా ప్రభుత్వ లక్ష్యమన్నారు.