కేంద్రంలోని భాజపా ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ.. కార్మిక సంఘాలతో కలసి ఉద్యమిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చైతన్య స్రవంతి సంస్థ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనకు మంత్రి సంఘీభావం తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా.. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడం దారుణమని అన్నారు.
ఇదీ చదవండి: పోలింగ్ రోజే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సర్పంచ్ అభ్యర్థి