ETV Bharat / state

"వైకాపా పాలనతో.. తెదేపా పునాదులు కదులుతున్నాయి" - tdp

సంక్షేమ పథకాల ఫలాలను ప్రజలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.

మోపిదేవి
author img

By

Published : Sep 7, 2019, 8:00 PM IST

మీడియా సమావేశంలో మంత్రి మోపిదేవి

వంద రోజుల్లో వైకాపా ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలతో తెదేపా పునాదులు కదులుతున్నాయని విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. విశాఖ జిల్లా వైకాపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం అభివృద్ధికి వ్యతిరేకం కాదని... గతంలో జరిగిన అవినీతిని వెలికితీసి అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విశాఖ భూ కుంభకోణాలపై మరోసారి సిట్ వేస్తామని దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, నవరత్నాలు అమలు చేసేందుకు వైకాపా ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని మోపిదేవి చెప్పారు.

Intro:ap_atp_61_04_1108undrallatho_poornahuthi_av_ap10005
~~~~~~~~~~~~~~*
1108 ఉండ్రాళ్ళతో పూర్ణాహుతి...
~~~~~~~~~~~~*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో భవానీ శంకర ఆలయంలో 1108 ఉండ్రాళ్ళ తో పూర్ణాహుతి కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఆలయంలో మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయగా అ పట్టణంలోని పురోహితులు అందరూ సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. బుధవారం నిమజ్జనం రోజు కాగా తెల్లవారి నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించారు. సర్పయాగం తోపాటు, 1108 ఉండ్రాళ్ళ తో పూర్ణాహుతి కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించగా, ఈ కార్యక్రమానికి మహిళా భక్తులు అధిక సంఖ్యలో హాజరై తమ మొక్కులు తీర్చుకున్నారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతరం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.