ETV Bharat / state

విశాఖ మెడ్​టెక్​ జోన్​లో నైపుణ్య విజ్ఞాన కేంద్రం ప్రారంభం - విశాఖ వార్తలు

విశాఖలో మెడ్​టెక్​ జోన్​లోని నైపుణ్య విజ్ఞాన కేంద్రాన్ని మంత్రి మేకపాటి గౌతమ్​రెడ్డి ప్రారంభించారు. పరికరాల తయారీలో వినియోగిస్తున్న నూతన సాంకేతికను పరిశీలించారు.

visaka medtech visit by minister mekapati goutham reddy
విశాఖ మెడ్​టెక్​ జోన్​ లో నైపుణ్య విజ్ఞాన కేంద్రం
author img

By

Published : Jan 20, 2021, 8:01 PM IST

విశాఖలోని మెడ్​టెక్​ జోన్​లో నైపుణ్య విజ్ఞాన కేంద్రాన్ని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రారంభించారు. బయోటెక్నాలజీకి సంబంధించిన స్కిల్ విజ్ఞాన్ సెంటర్​తో వైద్య రంగంలో యువతకు మరిన్ని అవకాశాలు వ‌స్తాయ‌ని మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు. ఏపీఎం​జెడ్​​లో కొత్త టెక్నాలజీతో మాస్కులు, వెంటిలేటర్ల తయారీని పరిశీలించారు. వైద్య పరికరాల తయారీ, పరిశోధన, టెక్నాలజీపై.. శాస్త్రవేత్తలు, ప‌రిశ్రమ వ‌ర్గాలు మ‌ధ్య స‌మ‌న్వయం వ‌ల్ల కొత్త అవిష్కర‌ణ‌ల త‌యారీ వేగ‌వంతం అవుతుంద‌ని మంత్రి మేకపాటి అన్నారు.

భవిష్యత్​ సాంకేతికత, అడ్వాన్స్ మెడికల్ ఎక్విప్​మెంట్లను, అత్యాధునిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన యంత్రాలు, వాటి పనితీరును మెడ్​టెక్​ జోన్​ ఎండీ జితేంద్ర శ‌ర్మ మంత్రికి వివ‌రించారు. 65 డెసిబుల్ స్థాయి ధ్వని నియంత్రణ నిర్మాణం, మాస్కులలో సూక్ష్మజీవుల అంతం చేసే ప్రక్రియ, క్లీన్ రూమ్‌, వెంటిలేటర్ల తయారీలో అడ్వాన్స్ టెక్నాలజీ తదితర యూనిట్లను పరిశీలించారు.

ఇదీ చదవండి: వాల్తేర్ క్లబ్​ సివిల్‌ వివాదంలో సిట్‌ జోక్యం వద్దు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.