విశాఖలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సచివాలయం సిబ్బంది, వాలంటీర్లతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. సచివాలయ సిబ్బందికి నిత్యవసర సరకులు పంచారు. సరిగ్గా ఏడాది క్రితం భారతదేశ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా రాష్ట్ర ప్రజలు 86 శాతం సీట్లతో వైకాపాకు ఘన విజయాన్ని అందించారని గుర్తు చేశారు.
జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి నవరత్నాల పథకాల అమలుతో పాటు అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారని చెప్పారు. వీటిని సక్రమంగా ప్రజలకు అందజేసేందుకు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి విజయం సాధించారని అన్నారు.
ఇదీ చూడండి: