విశాఖ జిల్లాకు చెందిన వైకాపా శాసనసభ్యులతో మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డిలు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా కృషి చేయాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి అవంతి స్పష్టం చేశారు. సోమవారం ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నెల 25 నుంచి జరిగే ఇళ్ల పట్టాల పంపిణీని కూడా పండుగ వాతావరణంలో జరుపుతామన్నారు.
ఇదీచదవండి