సినిమాలను వదిలేసి రావడమే సేవగా పవన్ భావిస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ''పవన్ కల్యాణ్ వయసెంత.. నా వయసెంత?'' అని అన్నారు. రాజకీయాల్లో వ్యక్తులను గౌరవించడం, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంతో ముఖ్యమని హితవు పలికారు. పవన్ మాట్లాడినట్టు అగౌరవపరిచే స్థాయిలో తాము మాట్లాడితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రెండు కిలోమీటర్లు పాదయాత్రకు సైతం పవన్ సరైన ప్రణాళిక చేసుకోలేకపోయారని విమర్శించారు.
ఇదీ చూడండి