సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న మంత్రి... స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇదీ చదవండి: పరిషత్ ఎన్నికలు తెదేపా బహిష్కరించటం సరైన నిర్ణయమే: రఘురామ