ETV Bharat / state

'చిట్టివలస జూట్ మిల్లు యాజమాన్యం పరిహారం చెల్లిస్తోంది' - చిట్టివలస జూట్​ మిల్ కార్మికులకు నష్టపరిహారం న్యూస్

చిట్టివలస జూట్ మిల్లు కార్మికులకు రూ.25 కోట్లు నష్టపరిహారం చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించినట్లు పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. అక్టోబరులో రూ.11 కోట్లు, నవంబరులో రూ.7 కోట్లు డిసెంబరులో రూ.7 కోట్లు చెల్లిస్తారని చెప్పారు. ఈ ప్రతిపాదనకు కార్మిక సంఘాలు కూడా అంగీకరించాయన్నారు.

minister avanthi srinivas on jutemill Workers Compensation

author img

By

Published : Sep 9, 2020, 12:24 AM IST

ఈ రోజు కార్మిక సంఘాలు, యాజమాన్యాలతో జరిపిన చర్చలు ఫలించాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. 694 మంది క్యాజువల్ కార్మికులకు రూ.25 వేలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిదన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం కార్మికులకు పూర్తి న్యాయం చేసేందుకు కృషి చేశామని చెప్పారు. ఈ ఒప్పందం వల్ల 6,500 మంది కార్మికులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

కలెక్టర్ వి.వినయ్ చంద్ మాట్లాడుతూ మంత్రి శ్రీనివాసరావు చొరవతో జూట్ మిల్​ సమస్య కొలిక్కి వచ్చిందని చెప్పారు. కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయని, కరోనా కారణంగా చర్చలు కొనసాగలేదని, ఈలోగా ఆర్థిక సంవత్సరం ముగిసిందని వివరించారు. కార్మికులకు పరిహారం సజావుగా జరిగేందుకు చెల్లింపు ప్రక్రియను జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుందని కలెక్టర్​ వెల్లడించారు.

ఇదీ చదవండి:

400 ఏళ్ల నాటి 'వింత' చెరువు- 12 గ్రామాలకు ఇదే దిక్కు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.