ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని... పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ అన్నారు. విశాఖ వుడా బాలల ప్రాంగణంలోని కార్యక్రమానికి హాజరైన మంత్రి.. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని... ఎన్నికల్లో 151 సీట్లు గెలుపొంది అధికారంలోకి వచ్చిన వ్యక్తి అని గుర్తు చేశారు. విధానపరంగా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావొచ్చని సూచించారు.
'దిశ' ఘటనపై విశాఖ సీపీతో చర్చించాం..
దిశ ఘటనపై తాము ఇప్పటికే విశాఖ నగర పోలీస్ కమిషనర్‌తో చర్చించామని... విజిలెన్స్, మానిటరింగ్ సమర్ధంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని అవంతి తెలిపారు. దిశ ఘటనకు బాధ్యులైన వారు మృగాల వంటివారని అభిప్రాయపడ్డారు. వారికి మరణ శిక్ష తక్కువేనని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి: 'పారిశ్రామిక వేత్తలను బెదిరిస్తే పరిశ్రమలు ఎలా వస్తాయి'