ETV Bharat / state

విశాఖలో స్టోన్ క్రషర్​కు రూ.10కోట్ల జరిమానా - visakha latest news

మెటల్, రాతి తవ్వకాల్లో నిబంధనలు అతిక్రమించిన స్టోన్​ క్రషర్ నిర్వహకులకు విశాఖపట్నం జిల్లా మైనింగ్ విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​ మెంట్ అధికారులు రూ.10 కోట్ల జరిమానా విధించారు.

Mining Vigilance and Enforcement officials fined Stone Crusher Rs 10 crore
స్టోన్ క్రషర్​కు రూ.10కోట్ల జరిమానా
author img

By

Published : Nov 30, 2020, 12:00 PM IST

నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపిన స్టోన్​క్రషర్ నిర్వాహకులకు విశాఖపట్నం జిల్లా మైనింగ్ విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​ మెంట్ అధికారులు రూ.10 కోట్ల జరిమానా విధించారు. అనకాపల్లి మండలం మార్టూరులో మెటల్, రాతి తవ్వకాలకు అంజని స్టోన్ క్రషర్ సంస్థ లీజు అనుమతులు పొందింది. 1,67,923 క్యూబిక్ మీటర్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు విజిలెన్స్ ఏడీ ప్రతాప్ రెడ్డి తనిఖీలో గుర్తించారు. ఇందుకు రూ.9.55కోట్లు, గ్రావెల్ తవ్వకాల్లో అక్రమాలకు సంబంధించి రూ.41.81 లక్షల జరిమానా విధించారు. పన్నులతో కలిపి రూ.10కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల కిందట ఇదే స్టోన్ క్రషర్ నిర్వాహకులు వేరొక సర్వే నెంబర్​లో అక్రమ తవ్వకాలు జరిపినట్లు గుర్తించి... రూ.4.5కోట్ల జరిమానా విధించారు.

ఇదీ చదవండి:

నివర్ ఎఫెక్ట్: విద్యుత్‌ సంస్థలకు రూ.5 కోట్ల నష్టం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.