విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కె.రాజశేఖర్(32) చైనాలో ఎంబీబీఎస్ పూర్తిచేశాడు. పీజీ చేయాలని అనుకున్నాడు. అయితే ఆర్థిక సమస్యలు వెంటాడాయి. తండ్రి కూడా అనారోగ్యానికి గురయ్యారు. ఈ పరిస్థితుల్లో తను పీజీ చేసే దారి కనిపించక మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి 8 గంటల సమయంలో నగరంలోని మధురవాడ గణేశ్‌నగర్‌లో ఉంటున్న స్నేహితుడు సుబ్బరాజు ఇంటికి వచ్చాడు. మిత్రుడు లేకపోవడంతో ఆయనకు ఫోన్ చేయగా.. తాను వచ్చే వరకు ఫ్లాట్‌లో ఉండమని చెప్పాడు. సుబ్బరాజు తన పని ముగించుకొని రాత్రి 11 గంటలకు వచ్చి ఫ్లాట్ తలుపు కొట్టగా ఎంతకీ తీయలేదు. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చి తలుపు తీసి చూడగా.. రాజశేఖర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై హరికృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పీఎంపాలెం సీఐ ఎ.రవికుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: ఒంటినిండా గాయాలు.. ఐదేళ్ల చిన్నారి అనుమానాస్పద మృతి