ఒడిశా-ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులపై దాడి చేసేందుకు మావోయిస్టులు ప్రణాళిక వేసినట్లు తెలుస్తోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో గిరిజనులతో కలిసి పోలీసులపై దాడికి మావోయిస్టుల ప్రణాళిక వేసుకున్న డ్రోన్ దృశ్యాలు కలకలం పుట్టిస్తున్నాయి. మావోయిస్టుల సూచనల మేరకు పోలీసులపై ముప్పేట దాడికి గిరిజనులు సమాయత్తం అవుతున్న అంశాన్ని పోలీసులు డ్రోన్ ద్వారా గుర్తించారు.
రెండు మూడు రోజులుగా గిరిజనులను మారుమూల ప్రాంతాల నుంచి ఒకచోటికి రప్పిస్తున్నట్టుగా పొలీసులకు సమాచారం లభించింది. కృష్ణరాం అటవీ ప్రాంతంలోని సుకుమా - మల్కన్ గిరి జిల్లా కేంద్రాలకు 30 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో వీరంతా సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీచదవండి