విశాఖ జిల్లా కొయ్యూరు ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టు గంగయ్య మృతిపై అనుమానాలున్నాయని ఆయన సోదరుడు మహేంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఆరుగురి మావోయిస్టుల మృతదేహాలకు నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం తెలంగాణకు చెందిన గంగయ్య మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులకు అప్పగించారు. గంగయ్యది భూటకపు ఎన్ కౌంటర్ అని అతని సోదరుడు మహేంద్ర ఆరోపించారు.
ఇదీ చదవండి: Maoist: ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలకు శవపరీక్ష పూర్తి