విశాఖ జిల్లా భీమిలిలో రవ్వ లక్ష్మి అనే 21 ఏళ్ల వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త శివశంకర్ నిన్న ఉదయం కూలి పని కోసం బయటకు వెళ్లగా ఆమె భార్య లక్ష్మీ ఇంట్లోని ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు ఆమెను స్థానిక ఎన్ఆర్ఐ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించింది.
విశాఖ నగరానికి చెందిన లక్ష్మిని.... రవ్వ శివ శంకర అనే వ్యక్తి ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరు ఇరువురు ఆదర్శనగర్ లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రాగా తరచూ గొడవ పడుతూ ఉండేవారని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో.. భీమిలి పోలీసులు మృతురాలి భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
ఈటీవీ భారత్ ఎఫెక్ట్: 'మద్యం' విధుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి