ETV Bharat / state

మన్యంలో మావో కరపత్రం.. అప్రమత్తమైన పోలీసులు - విశాఖ మన్యం వార్తలు

విశాఖ మన్యంలో మావోల కరపత్రాలు వెలిశాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న పీఎల్​జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోలు అందులో పేర్కొన్నారు.

Maoists posters appeard in Visakha agency
మన్యంలో మావోల కరపత్రాలు
author img

By

Published : Dec 2, 2019, 7:34 PM IST

విశాఖ మన్యంలో మావో కరపత్రాల కలకలం

విశాఖ మన్యంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపాయి. జి.మాడుగుల మండలం మద్దిగరువు, నుర్మతి... పెదబయలు మండలం బొంగరం వద్ద వీటిని అంటించారు. డిసెంబర్ 2 నుంచి 8 వరకు జరిగే ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (పి.ఎల్.జి.ఏ) వారోత్సవాలను విజయవంతం చేయాలని అందులో పేర్కొన్నారు. పెదబయలు, కోరుకొండ ఏరియా మావోయిస్టు కమిటీ పేరుతో స్థూపాలకు, చెట్లకు కరపత్రాలను అంటించారు. మావోయిస్టుల గెరిల్లా వారోత్సవాల నేపథ్యంలో విశాఖ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి:

'ఆంగ్ల మాధ్యమంలో చదివిన వ్యక్తులు జైలుకు ఎందుకు వెళ్లారు..?'

శివ. పాడేరు ఫైల్: Ap_vsp_78_02_mavoist_postarlu_paderu_av_ap10082.mp4 యాంకర్: విశాఖ.... మన్యం మారుమూల మావోయిస్టు పోస్టర్లు అంటించారు. జి.మాడుగుల మండలం మద్దిగరువు, నుర్మతి, పెదబయలు మండలం బొంగరం వద్ద వెలసిన మావోయిస్ట్ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. డిసెంబర్ 2 నుండి 8 వరకు జరిగే ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (పి.ఎల్.జి.ఏ) వారోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపు. పీడిత ప్రజల రాజ్యాధికార సాధన కోసం ప్రజా యుద్ధంలో భాగం కండి. యువతీ యువకులంతా ప్రజా విముక్తి గెరిల్లా సైన్యంలో చేరండి... అంటూ మావోయిస్ట్ పెదబయలు, కోరుకొండ ఏరియా కమిటీ పేరుతో స్థూపాలకు చెట్లకు వెలసిన కర పత్రాలు. ఇదిలా ఉండగా ఓ పక్కన మావోయిస్టుల గెరిల్లా వారోత్సవాలు పక్క పోలీసు తనిఖీలు కూంబింగ్ లతో విశాఖ సరిహద్దు ప్రాంతాలు గజగజ వణికిపోతున్నాయి. శివ, పాడేరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.