ETV Bharat / state

కరోనాతో జాగ్రత్త.. దూరం పాటించండి: మావోయిస్టులు - Maoists pay homage to corona affected people

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టిస్తున్న ప్రభావంపై మావోయిస్టులు స్పందించారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రజలు భౌతిక దూరం పాటించాలని పిలుపునిచ్చారు.

Maoists pay homage to people who have expired with corona
కరోనా వైరస్ మృతులకు మావోల సంతాపం
author img

By

Published : Apr 7, 2020, 3:00 PM IST

Updated : Apr 7, 2020, 3:43 PM IST

మావోయిస్టుల ప్రకటన

ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మల్కన్​గిరి కోరాపుట్ - విశాఖ డివిజన్ మావో కార్యదర్శి కైలాసం... కరోనా మహమ్మారి వ్యాప్తిపై స్పందించారు. అంతా భౌతిక దూరం పాటిస్తూ కరోనా నుంచి కాపాడుకోవాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వల్ల వేలాది మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సామ్రాజ్యవాదులు భూమిని వివిధ రకాలుగా నాశనం చేయడం వల్లనే ఇటువంటి వైరస్లు పుట్టుకొచ్చాయని ఆగ్రహించారు. ధనిక దేశాలు వైరస్ కట్టడిలో ముందస్తు చర్యలు చేపట్టడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సూచనలతో తగు జాగ్రత్తలు పాటించాలని ప్రజలను తమ పార్టీ కోరుతున్నట్లు ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:

మావోలకు కరోనా అంటూ విశాఖ మన్యంలో పోస్టర్లు

Last Updated : Apr 7, 2020, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.