మావోయిస్టులు, సానుభూతిపరులు స్వచ్ఛందంగా లొంగిపోవాలని.. విశాఖ జిల్లా చింతపల్లి ఏఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ మనుగడ కోల్పోయిందన్నారు. ప్రజలు సైతం తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మావోయిస్టులకు భవిష్యత్ లేదని.. గత ఏడాదిలో కేవలం 60 రోజుల్లో 30 మంది మిలీషియా సభ్యులు, దళసభ్యులు, నాయకులు లొంగిపోయారని అన్నారు. నూతన సంవత్సరంలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని భావిస్తే స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని చెప్పారు.
వారిపై నమోదైన కేసులను ఎత్తివేసి.. పునరావాసం కల్పిస్తామన్నారు. ఇప్పటికే 200 మందికి ఆంగ్లభాష, కంప్యూటర్ కోర్సు, కమ్యూనికేషన్ స్కిల్స్, గణితంపై శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. మరో పదిహేను రోజుల్లో సీలేరు కేంద్రంగా వంద మందికి అగరబత్తి, అడ్డాకుల తయారీపై శిక్షణ ఇస్తామన్నారు. అలాగే జీఎంఆర్ రక్షణ సహకారంతో సెక్యూరిటీ గార్డు, విజన్ టెక్నీషియన్ కోర్సుల్లో కూడా శిక్షణ ఇవ్వనున్నామని ఏఎస్పీ తెలిపారు. ఆసక్తి గల యువత సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ వద్ద పేర్లను రిజిస్టర్ చేసుకోవాలన్నారు.
ఇదీ చదవండి: