విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. 25 రోజుల వ్యవధిలో ముగ్గురు గిరిజనులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవిపుత్రులపై మావోయిస్టుల దాడులు అరికట్టాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. తమకు రక్షణ కల్పించాలంటూ... కలెక్టర్‌కు తమ గోడును వెల్లిబుచ్చుకున్నారు.
గతంలో తమపై అనేక దాడులు జరిగాయని అడవిబిడ్డలు చెబుతున్నారు. తమపై దాడులతోపాటు ఇళ్లను సైతం ధ్వంసం చేసి... గ్రామాల నుంచి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకుని ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతూ గోడు వినిపిస్తున్నా.. స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. గిరిజనులపై దాడులను అరికట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని గిరిజన సంఘాలు కోరుతున్నాయి.