ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులోని మావోయిస్ట్ సరిహద్దు ప్రాంతాల్లో జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిసారి మావోయిస్టు అమరవీరులకు గుర్తుగా... ఎర్ర స్థూపాలు కనిపిస్తాయి. కానీ ఈసారి మాత్రం.. విశాఖ ఏజెన్సీలో గిరిజన విద్యార్థి సంఘం పేరిట తెల్లటి తాత్కాలిక స్థూపాలు కనిపిస్తున్నాయి. 'మావోయిస్టులారా ఈ వారోత్సవాలు మాకొద్దు' అని వాటిపై రాసి ఉంది. పోలీస్ ఇన్ఫార్మర్ల నెపంతో మావోలు హత్యచేసిన గిరిజనుల పేర్లు వాటిపై ముద్రించి ఉన్నాయి. మూడురోజులుగా కోరుకొండ, చింతపల్లి, జి.మాడుగుల సంతల్లో.. ఈ తాత్కాలిక స్థూపాలు దర్శనమిస్తున్నాయి. ఏజెన్సీలో పోలీసులకు...మావోయిస్టులకు ఎప్పుడూ అంతర్గత యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కానీ ఈసారి స్థూపాల యుద్ధం... ఏజెన్సీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇవీ చూడండి-మనోహరి గోల్డ్ "టీ"... కిలో రూ.50 వేలు