విశాఖ మన్యంలోని గూడెం కొత్తవీధి సమీపంలో... పోలీసులకు సమాచారం చేరవేస్తున్నాడనే నెపంతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. పెదపాడుకు చెందిన తాంబేలు లంబయ్య అలియాస్ పిల్లలు దివుడు.. గతంలో మావోయిస్టు పార్టీలో పని చేశాడు. దివుడు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఇటీవల ఎన్‌కౌంటర్ చేశారని... అందుకే అతన్ని చంపుతున్నామని ఘటనాస్థలంలో మావోయిస్టులు లేఖలో వదిలివెళ్లారు. నిన్న సాయంత్రం చేనులో పని చేస్తుండగా... దివుడిని తీసుకెళ్లి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తాజా ఘటనతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి: