ETV Bharat / state

మావోయిస్టు కీలక నేత అరెస్టు.. పేలుడు పదార్థాలు స్వాధీనం

మావోయిస్టు కీలక నేతను విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి పోలీసులు అరెస్టు చేశారు. విప్లవ సాహిత్యంతోపాటు, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు చేసుకున్నారు.

maoist arrest
మవోయిస్టు కీలక నేత అరెస్టు
author img

By

Published : Sep 30, 2020, 4:45 PM IST

Updated : Sep 30, 2020, 6:54 PM IST

మావోయిస్టు కీలక నేత గెమ్మిలి కామేష్​ను విశాఖ జిల్లా గూడెంకొత్తవీధి పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ మన్యంలో మావోయిస్టు పార్టీని బలోపేతం చేయటానికి గాలికొండ ఏరియా కమిటీ బాధ్యతలు స్వీకరించిన గెమ్మిలి కామేష్​ అలియాస్ కుంకుమపూడి హరి అలియాస్ మాలతి.. పోలీసులకు చిక్కినట్లే చిక్కి.. తప్పించుకుపోయాడు. గూడెంకొత్త‌వీధి మండ‌లంలోని అట‌వీప్రాంతంలో ఉన్న‌ట్లు ప‌క్కా స‌మాచారంతో.. గాలింపు చేసి అరెస్టు చేశారు.

సీపీఐ మావోయిస్టు పార్టీలో 14 ఏళ్లుగా వివిధ క్యాడర్లలో పని చేసిన కామేష్ అలియాస్ హరిపై విశాఖ, తూర్పు గోదావరి, ఒడిశాలో 100కి పైగా కేసులున్నాయి. 5 హత్యలు, 4 మందుపాతరలతో పాటు ఏడు ఎదురుకాల్పుల ఘటనలతో పాటు, తోకరాయి, బత్తునూరు, చెరుకంపాకలు వద్ద జరిగిన ప్రజాకోర్టు ఘటనల్లో ఈయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కామేష్​పై 4 లక్షల రివార్డు ఉంది.

కామేష్ నుంచి 03 రైఫిల్, 20 రౌండ్ల బుల్లెట్లు, మూడు క్యారెజ్ మైన్లు, 50 కిలోల జిలెటిన్.. 200 మీట‌ర్లు ఎలక్ట్రిక‌ల్ వైర్‌, మ్యాన్ ప్యాక్‌, మావోయిస్టు విప్ల‌వ ‌సాహిత్యంతో పాటు ఇతర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిని అరెస్టు చేయటంలో కీలక పాత్ర వహించిన గూడెం కొత్త వీధి పోలీసులను డీఐజీ ఎల్​కే రంగారావు, జిల్లా ఎస్పీ బి కృష్ణారావు అభినందించారు.

ఇదీ చదవండి:

'వైకాపా ప్రభుత్వం అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతోంది'

Last Updated : Sep 30, 2020, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.