మావోయిస్టు ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరు మీద రెండు పేజీల లేఖ విడుదలైంది. ఆదివాసీ గిరిజనుల పోరాటాల ఫలితంగా ఎన్నో చట్టాలు వచ్చాయని... వీటిని కాలరాసే హక్కు ఎవరికీ లేదంటూ లేఖలో పేర్కొన్నారు. గిరిజనేతరులు.. ఈ చట్టాలకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ విషయంలో గిరిజనులు చేస్తున్న ధర్నాలు, ర్యాలీలు, బంద్‌లకు తాము మద్దతు ఇస్తున్నామన్నారు. ఆదివాసీలు చేసిన ఎన్నో త్యాగాలు పోరాటం ఫలితంగానే చట్టాలు వచ్చాయని చెప్పారు. భూ బదలాయింపు చట్టం, 1/70 చట్టం, పీసా చట్టం, అటవీ హక్కుల చట్టం ఆదివాసీల పోరాటాల ద్వారా వచ్చాయన్నారు. చట్టాలు లేకుంటే దోపిడి రాజ్యం పెరిగిపోతుందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
దివ్వాంగులకు 4 శాతం రిజర్వేషన్లు.. నియామకాలు, పదోన్నతుల్లో వర్తింపు