తొట్లకొండ, కొండవాలు ప్రాంతాల్లో లేఔట్లు వేయడాన్ని వ్యతిరేకిస్తూ... విశాఖ జిల్లా అంబేడ్కర్ భవన్లో మాన్యుమెంట్ ప్రొటెక్షన్ సభ్యులు నిరసన దీక్ష చేశారు. కొండవాలు ప్రాంతాల్లో లేఔట్లు వేసి వాటిని ప్రజా పంపిణీ చేస్తామని భీమిలి ఎమ్మార్వో చెప్పటం హాస్యాస్పదమని కొత్తపల్లి వెంకటరమణ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తోట్ల కొండ, కొండవాలు ప్రాంతాలను పరిరక్షణ చేయకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమిస్తామని అన్నారు.
ఇదీ చూడండి ఎల్జీ ఘటనపై మూడో రోజు కమిటీ భేటీ... సహాయక చర్యలపై ఆరా