Mandal Parishad Meeting : మండల పరిషత్ కార్యాలయ పరిసరాలనే పరిశుభ్రంగా చేసుకోలేకపోతే ఎలా..? కళ్ల ముందు కట్టిన ఇంటికే బిల్లు చేయకపోతే మనం ఎందుకు..? ఈ ప్రశ్నలు సంధించింది విపక్ష పార్టీలకు నాయకులు కాదండి.. అధికార వైకాపాకు చెందిన జడ్పీటీసీ సభ్యుడే. విశాఖ జిల్లా భీమునిపట్నం మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో.. విశాఖ వైకాపా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు సాక్షిగా.. జడ్పీడీసీ సభ్యుడు వెంకటప్పడు గోడు వెల్లబుచ్చుకున్నారు.
గత ప్రభుత్వంలో తొమ్మిది లక్షల వ్యయంతో మండల పరిషత్ ఆవరణలో నిర్మించిన బుద్ధిని పార్క్ అస్తవ్యస్తంగా తయారైందని.. ఆవేదన వ్యక్తం చేశారు . కార్యాలయాన్ని ధ్వంసం చేసి నెలలు గడుస్తున్నా నిర్మాణం చేపట్లేదన్నారు. సింగన బంధ గ్రామంలో శ్మశానానికి వెళ్లే దారి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మృతదేహాలను చేతులతో పైకెత్తి తీసుకెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. ఎమ్మెల్యే అవంతి .. జడ్పీడీసీ వెంకటప్పడుకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. ఆయన నిజాలు నిర్భయంగా సర్వసభ్య సమావేశంలో వెల్లడించారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న ఈటీవీ ప్రతినిధిపై ఓయ్ ఈటీవీ అంటూ.. ఆపాలని ఎమ్మెల్యే అవంతి సూచించారు.
ఇవీ చదవండి: