కొవిడ్ మందులు, ఆక్సిజన్ సిలిండర్లు అక్రమంగా సేకరించి అధిక ధరలకు విక్రయిస్తున్న ఓ వ్యక్తిని విశాఖ ఎంవీపీ స్టేషన్ పోలీసులు అరెస్టు చేశారు. ఎంవీపీ కాలనీ సెక్టర్-6లో నివాసముంటున్న కేతావత్ అశోక్ నాయక్.. కొంతకాలంగా కొవిడ్ మందులు అధిక ధరలకు విక్రయిస్తున్నాడన్న సమాచారం మేరకు.. టాస్క్ ఫోర్స్ సిబ్బంది, పోలీసులు దాడులు నిర్వహించారు. అతని వద్ద ఎలాంటి ప్రభుత్వ లైసెన్స్ లేకుండా నిల్వ ఉంచిన ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర మందులు, ఇంజెక్షన్లు ఉన్నట్లు గుర్తించి మందులు స్వాధీనం చేసుకున్నారు. అశోక్ నాయక్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై గణేష్ కుమార్ తెలిపారు.
ఇదీ చదవండి: