మహారాష్ట్రలోని పూణే ప్రాంతం సాల్గొన్‌కు చెందిన ప్రహ్లాద్..విశాఖ జిల్లా పాడేరులోని టెక్నో సంస్థలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. కాఫీ రైతులకు పంటలో శిక్షణ ఇచ్చేందుకు ఈ ప్రాంతానికి వచ్చాడు. నాలుగు రోజుల కిందట.. తనకు కొవిడ్ లక్షణాలు ఉన్నాయంటూ తోటి ఉద్యోగులకు ఫోన్ చేశాడు. మెరుగైన చికిత్స కోసం విశాఖ తరలించాలని కోరాడు. ప్రస్తుతం అక్కడ ఆసుపత్రిలో సదుపాయాలు తక్కువగా ఉన్నందున.. అంబులెన్స్‌లో పాడేరు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు.
మంగళవారం ఆరోగ్యం కాస్త మెరుగవడంతో.. వెంటిలేషన్ తీసివేశారు. తన పరిస్థితి బాగోలేదని తన వారికి ఫోన్‌లో వివరిస్తుండేవాడు. కానీ తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందాడు. మహారాష్ట్రలోని అతడి కుటుంబీకులకు ఆసుపత్రి సిబ్బంది సమాచారం అందించారు. లాక్‌డౌన్ పరిస్థితుల వల్ల రాలేకున్నామని.. ఖననం చేయాలని వారు కోరారు. టెక్నో సంస్థ అధికారులు.. పాడేరులోని తోటి ఉద్యోగులను అప్రమత్తం చేశారు. అందరూ ముందుకు వచ్చి పీపీఈ కిట్లు ధరించి.. అన్నీ తామై మృతదేహానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు.
ఇదీ చదవండి :
గ్రామాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు.. పారిశుద్ధ్య మెరుగుదలకు అధికారుల చర్యలు