ETV Bharat / state

లాక్​డౌన్ కఠినం​.. రచ్చబండ ముచ్చట్లు కుదరవ్​!

పట్టణాల్లోనే లాక్​డౌన్​ని కఠినంగా అమలు చేస్తారు. పోలీసుల పహారా అక్కడే ఎక్కువగా ఉంటుంది. మన ఊరిలో అంతగా ఏమి ఉండదు. రండిరా రచ్చబండ దగ్గర కూర్చొని ముచ్చట్లాడుకుందాం.. అని అనుకున్నారో పోలీసుల చేతిలో మీ పని అయ్యిందే.

lockdown in Visakha district is strictly enforced

author img

By

Published : Apr 7, 2020, 10:53 AM IST

విశాఖ జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని.. లాక్​డౌన్​ని మరింత పటిష్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటి వరకు మండల కేంద్రాలు, మేజరు పంచాయతీలకే పరిమితమైన పోలీసుల పహారాను.. ఇక నుంచి కుగ్రామాలకు సైతం విస్తరించనున్నారు. ఈ మేరకు గుంపులు గుంపులుగా ఒక చోట చేరిన వారిని, రచ్చబండల వద్ద ఊసులాడే వారిని స్టేషన్​కు తీసుకువెళ్లనున్నారు. వారిపై కేసులు నమోదు చేయనున్నారు. చోడవరంలో సోమవారం 200 వరకూ ఇలాంటి కేసులనే పోలీసులు నమోదు చేశారు.

ఇదీ చదవండి:

తల్లి ఆఖరి చూపునకు నొచుకోని కానిస్టేబుల్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.