![మురుగు పక్కనే కూరగాయల కొనుగోళ్లు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vsp-55-10-narsipatnam-lo-chetha-samasya-av-ap10081_10102020222400_1010f_03196_884.jpg)
![చెత్త కమ్మేస్తోంది.. మురుగు ముంచేస్తోంది..!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-vsp-55-10-narsipatnam-lo-chetha-samasya-av-ap10081_10102020222400_1010f_03196_558.jpg)
కరోనా ఓ వైపు భయానికి గురి చేస్తుంటే... మరోపక్క పారిశుద్ధ్య సమస్యతో నర్సీపట్నం వాసులు అల్లాడిపోతున్నారు. ఎక్కడ రోగాలకు గురి కావాల్సివస్తుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఏ వీధిలో చూసినా చెత్త నిల్వలు పేరుకుపోయాయి.
ఫలితంగా వర్షపు నీరు దిగువకు వెళ్లలేక... జనావాసాల మధ్యే చెరువులుగా దర్శనమిస్తున్నాయి. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా పారిశుద్ధ్యం చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు దృష్టిసారించాలని కోరుతున్నారు.