ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో లైన్​మెన్ మృతి...కేసు నమోదు - విశాఖ జిల్లా నేర వార్తలు

విశాఖ జిల్లా పద్మనాభం మండలంలో విద్యుత్ లైన్​మెన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అనుమానాస్పద స్థితిలో లైన్​మెన్ మృతి
అనుమానాస్పద స్థితిలో లైన్​మెన్ మృతి
author img

By

Published : Nov 3, 2021, 9:26 PM IST

విశాఖ జిల్లా పద్మనాభం మండలం ఏనుగులపాలెంలో విద్యుత్ లైన్​ మెన్ అనుమానాస్పదంగా మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆనందపురం మండలం గొట్టిపల్లిలో బంగార్రాజు విద్యుత్ లైన్​మెన్ గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. గత ఆదివారం సాయంత్రం నుంచి బంగార్రాజు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు భీమునిపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాగా.. ఇవాళ మధ్యాహ్నం ఏనుగులపాలెం పంటపొలాల్లో లైన్ మెన్ మెుల్లి బంగార్రాజు మృతదేహం లభ్యమైంది.

మృతుడు తన భార్య, పిల్లలతో తగరపువలస సమీపంలో నమ్మివానిపేటలో నివాసం ఉంటున్నారు. బంగార్రాజు మృతి మిస్టరీగా మారడంతో.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఇదీ చదవండి:

GRMB: గోదావరి బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ.. ఏం చెప్పిందంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.