ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించటానికి ప్రతిపక్ష నేత అనుమతికి దరఖాస్తు చేస్తే ఇబ్బందులు పెట్టడం సరికాదని... తెదేపా శాసన సభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ , సీఎం మధ్య లోపాయికారీ ఒప్పందం జరిగిందని ఆరోపించారు.
అందుకే అనుమతి ఇవ్వకుండా ఆలస్యం చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తే ఏపీ ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేసిందని ప్రశ్నించారు. ఒక 70 ఏళ్ల మహిళ ప్రభుత్వంపై విమర్శ చేస్తే.. సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేయడం దురదృష్టకరమని చెప్పారు.
ఇదీ చదవండి: