విశాఖ ఆంధ్ర విశ్వ విద్యాలయంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయ కళాశాలలో.... జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేరిట గౌరవ ప్రసంగ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథులుగా విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వరరావు, రాష్ట్ర అడిషనల్ అటానరీ జనరల్ సుధాకర్ పాల్గొన్నారు.
జస్టిస్ లావు నాగేశ్వరరావు ప్రసంగంలో...
రాజ్యాంగ విలువలపై వ్యక్తి జీవితం, స్వేచ్ఛ, న్యాయపరమైన అంశాల ప్రభావం గురించి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు గౌరవ ప్రసంగించారు. దేశంలో న్యాయ వ్యవస్థ ఏర్పడిన తీరు, న్యాయ పరమైన అంశాలు... వ్యక్తులు జీవనానికి ఎలా దోహదం చేశాయో వివరించారు. విద్యార్థి దశలో ఉండే న్యాయ విద్యార్థులు ప్రశ్నించే గుణం అలవాటు చేసుకోవాలని... అప్పుడే ఒక అంశం పట్ల సమగ్ర చర్చ జరిగి... సమాజానికి ఉపయోగపడే అంశాలకు నాంది పలుకుతుందని తెలిపారు. నిత్యం నేర్చుకునే తత్వం వల్ల...సమస్యల నుంచి బయటకు వచ్చే మార్గాలు తెలుస్తాయని అన్నారు.
విద్యార్థి దశలో అనేక అంశాలు... అవగాహన కల్పించే దృక్పథంతోనే ఆంధ్ర విశ్వ విద్యాలయ న్యాయ కళాశాలలో ఈ కార్యక్రమం నాంది పలుకుతుందని... విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వరరావు చెప్పారు. విజయం సాధించాలంటే నిరంతరం కష్టపడాలే తప్ప... మరో ప్రత్యామ్నాయం లేదని తెలిపారు.
ఇదీ చూడండి: విశాఖలో నావికుల పాసింగ్ అవుట్ పరేడ్