విశాఖ పాడేరు మన్యంలో గిరి విద్యార్థులు ఏదో పనిలో మునిగి తేలుతూ ఉంటారు. ఓ పక్కన ఇంటి పనులు చేసుకుంటూ.. ఆటపాటలతో.. శారీరక శ్రమ చేస్తుంటారు. కరోనా వ్యాప్తి కారణంగా లాక్డౌన్ నిబంధనలతో పాఠశాలలు తెరుచుకోలేదు. గిరి విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. పాడేరు మండలం డోకులూరు పంచాయితీ గుర్రాల తోటలో బాలలు గ్రామ చెరువులో ఈత నేర్చుకునే పనిలో నిమగ్నం అయిపోయారు.
నడుముకు టైర్ కట్టుకుని ఈత నేర్చుకుంటున్నారు. నగరాల్లో కరోనా కాలంలో కొందరు పిల్లలు మొబైల్ ఫోన్ల ఆటలకు బానిస అయ్యారు. ఏజెన్సీ ప్రాంతంలో అటువంటి పరిస్థితి లేదు. శారీరక దారుఢ్యం శ్రమ చేస్తూనే ఉంటారు. అయితే ఈత సరదా జల క్రీడల్లో భాగమైనప్పటికీ తల్లిదండ్రులు వారి పిల్లలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఇదీ చదవండి: