విశాఖ జిల్లా చోడవరం మండలంలో కన్నంపాలెం గ్రామం... ఇక్కడ 2006 నుంచి పంచాయతీ ఎన్నికలు జరగటం లేదు. కారణం.. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టకపోవడమే. ఎన్నికల నిర్వహణతో ఖర్చులు... విభేదాలు తప్ప ఏం ఉండవని గ్రహించిన ఆ గ్రామస్థులు... ఏకగ్రీవమే సరైన నిర్ణయం అనుకున్నారు. ఇలా ఒక్కసారి కాదు.. 2006 నుంచి సర్పంచి అభ్యర్థిని ఏకగ్రీవంగా ప్రకటిస్తూ వస్తున్నారు. ప్రభుత్వ ఇచ్చే నజరానతో గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసుకుంటున్నారు.
కన్నంపాలెం పంచాయతీ 1995లో ఏర్పడింది. అంతకు ముందు చాకిపల్లి పంచాయతీలో ఉండేది. ఎన్నికల వల్ల కలిసొచ్చేదేమి లేదని వారంతా 2006 నుంచి పంచాయతీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నజరానాతో సిమెంట్ రహదారులు, కాలువలు, తాగునీటి సదుపాయం ఏర్పాటు చేశారు. గెలిచిన అభ్యర్థులు కూడా తమ సొంత నిధులతో ఆలయాలు నిర్మించారు. గ్రామాభివృద్ధి కోసం చిన్న, పెద్ద. యువత అందరూ ఐక్యమత్యంగా కలిసి ముందుకు సాగుతూ చుట్టుపక్కల గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇదీ చదవండి : మున్సి 'పోల్స్': నామినేషన్ల దాఖలుకు నియమ నిబంధనలు