విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణపులోవ జలాశయాన్ని జలవనరుల శాఖ సాంకేతిక విభాగం అధికారులు పరిశీలించారు. జలాశయానికి చేయవలసిన మరమ్మతులను గుర్తించారు. ప్రధానంగా విద్యుత్ ఏర్పాటు గేట్ల మరమ్మతులు, ప్రధాన కాలువలు విస్తరణ, ప్రధాన గేట్లకు రంగలు వేయడం తదితర పనులను గుర్తించి నివేదికలను తయారు చేశారు. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 460 అడుగులు కాగా... ప్రస్తుతం 445.5 అడుగుల మేర నీటిమట్టం ఉంది. రావికమతం, రోలుగుంట, మాకవరపాలెం తదితర మండలాల్లోని సమారు 5 వేల ఎకరాలు ఈ జలాశయంపై ఆధారపడి ఉన్నాయి. మరమ్మతుల కారణంగా ప్రస్తుతం 3 వేల ఎకరాలకు మించి సాగవడం లేదు. ఈ నేపథ్యంలో జలవనరుల శాఖ సాంకేతిక శాఖ డీఈ వెంకటేశ్వరరావు, నర్సీపట్నం డీఈ స్వామి నాయుడు తదితరులు జలాశయ పరిశీలనకు వచ్చారు.
ఇదీ చదవండి :