విశాఖ జిల్లా రావికమతం మండలం కళ్యాణపులోవ లో మైనింగ్ అనుమతులు వెంటనే రద్దు చేయాలనిగిరిజనులు,రైతులు డిమాండ్ చేశారు. విశ్రాంత ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ నేతృత్వంలో విశాఖలో నిర్వహించిన ప్రజా వేదికలో రైతులు,గిరిజనులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రస్తుతం నాలుగు గ్రానైట్ క్వారీలకు అనుమతి ఉందని, మరో 22 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. మైనింగ్ కోసం వెళ్లే భారీ వాహనాలతో రహదార్లు పూర్తిగా ఛిద్రమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్వారీనుంచి వచ్చే వ్యర్ధాలతో ఆ ప్రాంతం కాలుష్యంగా మారిందని చెప్పారు. ఈ వ్యర్ధాలు రిజర్వాయర్ లోకి ప్రవహించే అవకాశం ఉందని, దీంతో తాగు-సాగు నీరు కలుషితం అవుతుందని రైతులు, గిరిజనలు పేర్కొన్నారు. క్వారీ పేలుళ్లకు కళ్యాణపు లోవ రిజర్వాయర్ దెబ్బతిని గండి పడితే మాత్రం దాదాపు పది గ్రామాలు కొట్టుకుపోతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఆ 'కిరణ్మయి' నిలిపింది.. నాలుగేళ్ల 'కవిరాజ్' జీవితాన్ని..