విశాఖలో సంచలనం రేపిన జుత్తాడ ఘటనకు సంబంధించి.. బాధిత కుటుంబ సభ్యులు, మృతుల బంధువులు.. మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్‌ను కలిశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి.. నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు. జుత్తాడ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ సర్వే చేసి.. అప్పలరాజు ఆక్రమించికున్న ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ.. నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమ కుటుంబానికి న్యాయం చేయాలని.. బాధితుడు విజయ్ కోరారు.
ఇదీ చదవండి: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ వర్కర్స్ యూనియన్ నిరసన