ETV Bharat / state

కరోనా బారిన పడిన జర్నలిస్టులను ఆదుకోవాలని నిరసనలు

కరోనా బారిన పడిన జర్నలిస్టులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ... విశాఖ, విజయనగరం జిల్లాల్లో పాత్రికేయులు నిరసనకు దిగారు. కొవిడ్​తో మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

journalists protest
జర్నలిస్టుల నిరసనలు
author img

By

Published : Sep 14, 2020, 6:26 PM IST

విశాఖ జిల్లాలో...
కరోనా బాధిత జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పాత్రికేయ సంఘాల ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. కరోనా సోకిన జర్నలిస్టులకు నెలకు రూ.25 వేల ఆర్థిక సాయాన్ని అందించాలనీ.. ఆసుపత్రుల్లో కొవిడ్ చికిత్స పొందుతున్న వారి కోసం ప్రత్యేక బెడ్​లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స ఖర్చును ప్రభుత్వమే చెల్లించాలన్నారు. కొవిడ్​తో మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఉద్యోగాల నుంచి తొలగించిన జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కొత్త అక్రిడేషన్లు అందించాలనీ.. హెల్త్ కార్డులను పునరుద్ధరించాలని కోరారు. ప్రభుత్వ ఆరోగ్య బీమాను అమలు చేయాలని అన్నారు.

విజయనగరం జిల్లాలో..

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. అందులో భాగంగా విజయనగరం జిల్లాలో జర్నలిస్టులు కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్షను చేపట్టారు. పాత్రికేయుల నిరసనకు రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ప్రజా, కార్మిక సంఘాల నాయకులు మద్దతు ఇచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కారణంగా జర్నలిస్టుల కుటుంబాల పరిస్థితి ఘోరంగా మారిందని వాపోయారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని కోరారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించకపోతే.. ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: విశాఖ ఎన్​కౌంటర్​పై అవసరమైతే ఎన్ఐఏతో విచారణ: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.